రాష్ట్రం అప్పుల ఊబిలో ఎందుకుంది ?

కేసీఆర్ కుటుంబం చాలా పెద్దదని.. వాళ్లు అధికారంలో ఉన్నందునే రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మునుగోడు బీజేపీ సభలో అమిత్ షా అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. పెట్రోల్ ధరలు మోడీ సర్కారు రెండుసార్లు తగ్గించినా.. కేసీఆర్ సర్కారు తగ్గించలేదని గుర్తు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని చెప్పారు.

మోడీ సర్కారు రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఎందుకుందని అమిత్ షా ప్రశ్నించారు. 8 ఏండ్ల పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప యువతకు ఉపాధి దక్కలేదని అమిత్ షా వాపోయారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలో కమలం వికసించేలా చేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు.