బీజేపీ ఉన్నంత వరకు పీఓకే భారత్ ఆధీనంలోనే ఉంటుంది: అమిత్ షా

బీజేపీ ఉన్నంత వరకు పీఓకే భారత్ ఆధీనంలోనే ఉంటుంది: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులను ఏరివేశామని.. కాంగ్రెస్ కు  సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం లేదని చెప్పారు. ఆటం బాంబు ఉందని...పీవోకే ను పాక్ కు అప్పగిస్తామా అని ప్రశ్నించారు. బీజేపీ ఉన్నంతకాలం పీఓకే భారత్ ఆధీనంలోనే ఉంటుందన్నారు. 

మే 11వ తేదీ శనివారం చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్లో ని వికారాబాద్ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటింఎలా మారిందన్ని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దుపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం  చేస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ ఓటు బ్యాంకుకు భయపడుతున్నారని చెప్పారు. ప్రధానిగా మోదీ కావాలో.. రాహుల్ కావాలో దేశ ప్రజలే నిర్ణయించుకోవాలని షా అన్నారు.