Cyber Crime 14C అంటే ఏంటీ..? : అమితాబ్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు..!

Cyber Crime 14C అంటే ఏంటీ..? : అమితాబ్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు..!

టెక్నాలజీ మీద పెరుగుతున్న డిపెండెన్సీ సైబర్ నేరాలకు దారి తీస్తోంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉన్న ఈరోజుల్లో సైబర్ నేరాల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. ఈ క్రమంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 2018లో 14C స్కీంను లాంచ్ చేసింది కేంద్రం.ఇంతకీ.. 14C  అంటే ఏంటో, బిగ్ బీ అమితాబ్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

I4C పౌరుల కోసం సైబర్ క్రైమ్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది, ఇందులో వివిధ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం దీని ముఖ్య లక్ష్యం. 2018లో కేంద్రం లాంచ్ చేసిన 14C.. సైబర్ నేరాలను పరిష్కరించడానికి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య  సమన్వయాన్ని పెంచి దేశం యొక్క సామూహిక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా పని చేస్తుంది.

Also Read :- అమెరికాను మళ్లీ నంబర్ వన్ గా నిలబెడతా

14C లక్ష్యాలు :

  • దేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు నోడల్ పాయింట్‌గా వ్యవహరించడం.
  • మహిళలు మరియు పిల్లలపై జరిగే సైబర్ నేరాలను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించటం.
  • సైబర్ క్రైమ్ కే సంబంధించిన ఫిర్యాదులను సులభంగా ఫైల్ చేయడం సైబర్ క్రైమ్ ట్రెండ్‌ లు, రకాలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టడం.
  • సైబర్ నేరాల అరికట్టేందుకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పని చేయడం.
  • సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం.
  • సైబర్ ఫోరెన్సిక్, ఇన్వెస్టిగేషన్, సైబర్ హైజీన్, సైబర్-క్రిమినాలజీ మొదలైన అంశాలలో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు జ్యుడీషియల్ ఆఫీసర్ల సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది.

సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం చేస్తున్న కృషికి త్నానవంతుగా మద్దతిచ్చేందుకు ముందుకొచ్చారు అమితాబ్. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. "దేశంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని.. వీటిని అరికట్టేందుకు కేంద్రానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హోం మంత్రి అమిత్ షా పట్టుబట్టడంతో తాను ఈ ప్రచారంలో చేరానని ఈ సమస్యకు వ్యతిరేకంగా ఏకం కావడం వల్ల సైబర్ నేరాల నుంచి మనల్ని రక్షించుకోవచ్చని అన్నారు అమితాబ్. ఈ వీడియోకు రిప్లై ఇచ్చిన హోమ్ మంత్రి అమిత్ షా అమితాబ్ కు కృతఙ్ఞతలు తెలిపారు.