- రేపు తెలంగాణ విమోచన దినోత్సవాలకు హాజరు
- పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రోగ్రామ్
- సభ తర్వాత గంట పాటు పార్టీ లీడర్లతో ప్రత్యేక భేటీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్ లో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జాతీయ పతాకం ఆవిష్కరించి సభలో మాట్లాడుతారు. తర్వాత మళ్లీ సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీస్మెస్ కు వెళ్లిపోతారు. అక్కడ గంట పాటు పార్టీ స్టేట్ లీడర్లతో సమావేశం అవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసే విషయమై లీడర్లకు అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు.
తర్వాత అక్కడే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో భేటీ అవుతారు. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం.. పరేడ్ గ్రౌండ్లో ప్రోగ్రామ్ ముగించుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ, పరేడ్ గ్రౌండ్ సభ తర్వాత మళ్లీ ఆయన సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీస్ మెస్‌కు వెళ్తారు.
ALSO READ:తెలంగాణపై స్పెషల్ ఫోకస్..ఇయ్యాల్టి(సెప్టెంబర్ 16) నుంచి సీడబ్ల్యూసీ మీటింగ్
అమిత్‌షా టూర్ షెడ్యూల్
అమిత్‌షా శనివారం సాయంత్రం 5.15 గంటలకు బీహార్‌లోని దర్బాంగ్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.20కి శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్ రాత్రి 8 గంటలకు సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్ మెస్‌కు వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
ఆదివారం ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని అమరుల స్తూపం వద్ద నివాళి అలర్పిస్తారు. 11గంటల వరకు తెలంగాణ విమోచన దినోత్సవ ప్రోగ్రామ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు.
11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్ నుంచి బయ లుదేరి.. మళ్లీ సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరు కుంటారు. 11.50 నుంచి 12.45 దాకా రిజర్వ్డ్ టైమ్‌గా షెడ్యూల్లో ఉంది. ఈ టైమ్‌లో పార్టీ నేతలతో సమావేశం, పీవీ సింధుతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2.20 కల్లా శం షాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 2.25కు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోతారు.