యాదాద్రి, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. గురువారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రాయిగిరిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో మాట్లాడుతారు. అనంతరం బేగంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు వెళ్తారు. సభ ఏర్పాట్లను కో ఆర్డినేట్ చాడ సురేశ్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి, పాపారావు, పాశం భాస్కర్, దాసరి మల్లేశం పర్యవేక్షిస్తున్నారు.
భువనగిరిలో బీజేపీ బైక్ ర్యాలీ
యాదాద్రి, వెలుగు : భువనగిరిలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అమిత్ షా బహిరంగ సభను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.