ఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సోమవారం ( అక్టోబర్ 7, 2024 ) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ఈ మీటింగ్ కు తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మధ్యప్ర దేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్ లు, డీజీపీ హాజరుకానున్నారు.
ALSO READ | మార్పు మొదలు.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై వినేష్ ఫొగట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ( అక్టోబర్ 6, 2024 ) రాత్రికే ఢిల్లీ చేరు కోనున్నారు. రెండ్రోజుల కిందట ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అభయారణ్యంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ, రాష్ట్రాల భాగ స్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.