టెర్రరిజం, నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడుతం: అమిత్ షా

టెర్రరిజం, నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడుతం: అమిత్ షా
  • హోంమంత్రిగా బాధ్యతల స్వీకరణ
  • కేంద్ర మంత్రులుగా చార్జ్ తీసుకున్న నేతలు

న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం దేశ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. టెర్రరిజం, తిరుగుబాటు, నక్సలిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళవారం తన చాంబర్​లో హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు తీసుకున్నారు. దీనికి ముందు ఆయన చాణక్యపురి ఏరియాలోని నేషనల్ పోలీస్ మెమోరియల్​ను సందర్శించి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ లీడర్​షిప్​లో వరుసగా రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉన్నది. ఎప్పటిలాగానే..  దేశ, ప్రజల భద్రతకు హోంశాఖ కట్టుబడి ఉన్నది. మోదీ పాలనలో రక్షణ వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటది. వారి త్యాగాలను వృథా పోనివ్వం’’ అని అమిత్ షా అన్నారు. చట్టాలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

చైనాతో సమస్యల పరిష్కారానికి కృషి: జైశంకర్

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎస్.జైశంకర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మోదీ నేతృత్వంలో ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. ఇండియా బార్డర్ వెంట చైనాతో ఉన్న సమస్యలను దౌత్యమార్గంలో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ జోషి, మనోహర్ లాల్ ఖట్టర్ పవర్, చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్,  భూపేందర్ యాదవ్, చిరాగ్ పాశ్వాన్, అన్నపూర్ణ దేవి, ఎంపీ సురేశ్ గోపీ,  కుమార స్వామి, జితన్​రామ్ మాంఝీ, లలన్​సింగ్, రామ్మోహన్ నాయుడు తదితరులు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.