* జనజీవన స్రవంతిలో కలవండి
* రాష్ట్రాల పోలీసుల విభాగాలు బాగా పనిచేస్తున్నయ్
* కేంద్ర హోం మంత్రి అమిత్ షా
* మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో భేటీ
న్యూఢిల్లీ: పోలీస్ శాఖ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర బాగా పనిచేశాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్ లో వామపక్ష ఉగ్రవాదంపై పై చేయి సాధించామని అన్నారు.
మావోయిస్టులు హింసతో ఏదీ సాధించలేరని.. అందుకే జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. బహుముఖ వ్యూహాలను అమలుచేస్తూ.. మావోయిస్టు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. ఈ అంశంలో ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా 2026 నాటికి నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్ అంశాలపై ప్రధానంగా చర్చించారు.
దేశంలో మావోయిస్టు సమస్య లేకుండా చేయడమే ప్రస్తుత లక్ష్యమని.. అందుకోసం తదుపరి కార్యచరణ, రాష్ర్టాల భాగస్వామ్యంపై మాట్లాడారు.‘‘వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలి. కానీ ప్రభుత్వ ఫలాలు వారికి చేరకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారు. రోడ్లు, టవర్లు, చివరకు విద్య, వైద్యం కూడా గిరిజన ఆదివాసీలకు చేరనీయడం లేదు.
ALSO READ | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా భేటీ..
గత కొన్నేళ్లలో మావోయిస్టు సమస్యను ఎదుర్కొనే విషయంలో గణనీయమైన పురోగతి సాధించాం. మావోయిస్టుల ప్రభావిత గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు, పథకాలు కూడా వేగంగా చేరుతున్నాయి. బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి’’ అని అమిత్ షా కొనియాడారు.