కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని లాల్‌బాగ్చా గణేష్ను దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా వెంట మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా.. ఆదివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయ్యారు. ఈ నెల లేదా అక్టోబర్‌లో జరగబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ఆయన ముంబైకి వెళ్లారు. ఈ క్రమంలో లాల్ బాగ్చా రాజాను ఆయన దర్శించుకున్నారు.
#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah, CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis offered prayers to Mumbai's Lalbaugcha Raja pic.twitter.com/8DIZmdqgRE
— ANI (@ANI) September 5, 2022
హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేషుడు ఎంత ఫేమసో... ముంబైలో లాల్‌బాగ్చా రాజా అంత ఫేమస్.. ఇక్కడ వినాయకుడిని చూసేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గంటల తరబడి క్యూలో వేచి ఉంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా లాల్‌బాగ్ రాజా గణపతి విగ్రహాన్ని 12 అడుగుల ఎత్తులో తయారు చేశారు. ఈసారి గణేశుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. గత ఎనిమిది దశాబ్దాలుగా కాంబ్లీ కుటుంబం లాల్ బాగ్చా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.