తెలంగాణలో అమిత్ షా టూర్‌‌కు ఏర్పాట్లు

సూర్యాపేట, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  ఈ నెల 27న సూర్యాపేటకు రానున్నారు.  కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద నిర్వహించనున్న ప్రజా గర్జన సభలో పాల్గొననున్నారు.  ఈ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాదర్శి గుజ్జెల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సూర్యాపేట బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అద్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి మంగళవారం పరిశీలించారు. అంతకముందు జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి  మండలాల వారీగా ఇన్‌చార్జి నియమించారు.

బహిరంగ సభను సక్సెస్ చేయండి

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్న జనగర్జన సభను సక్సెస్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు,  ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు  పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సభకు రెండు రోజుల ముందు కోదాడ, హుజూర్ నగర్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత ఖర్చుపెట్టినాప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది బీఆర్‌‌ఎస్‌కు వేసినట్లేనని , 2014 ,18 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌‌ఎస్‌లో చేరడమే ఇందుకు నిదర్శనం అన్నారు.  బీజేపీ, బీఆర్‌‌ఎస్‌ ఒక్కటేనని  కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటి వరకు కలిసి పోటీ చేయలేదని స్పష్టం చేశారు.