- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అమిత్ షా దిష్టిబొమ్మల దహనం
కరీంనగర్ సిటీ, వెలుగు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకంచేశారు. నియోజకవర్గ ఇన్ చార్జి పురుమళ్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, నాయకులు సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
గోదావరిఖని, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేడ్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనగా దళిత సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని టి. జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
కోరుట్ల,వెలుగు: కోరుట్ల లో మాల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ రహదారిపై అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, రాస భూమయ్య, బద్ది మురళీధర్ , దుంపల రాజనర్సయ్య, పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో అమిత్ షా చిత్ర పటాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్యాబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. చొప్పదండి ప్రకాశ్, రాములు పాల్గొన్నారు.