అమితాబ్ బచ్చన్ హెల్త్ అప్డేట్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన బిగ్ బి

అమితాబ్ బచ్చన్ హెల్త్ అప్డేట్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన బిగ్ బి

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రమాదవశాత్తు గాయపడ్డ విషయం తెలిసిందే. ఒక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో ప్రమాదం జరిగి అమితాబ్ పక్కటెముకలకు గాయమైంది. ప్రమాదం జరిగిన అనంతరం అమితాబ్ ను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అమితాబ్ ముంబైకి పయనమయ్యారు. అమితాబ్​కు రెండు నుంచి నాలుగు వారాలు బెడ్​ రెస్ట్​ అవసరమని తర్వాత షూటింగ్ లో పాల్గొనచ్చని వైద్యులు సూచించారు. అయితే, తాజాగా అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ అప్ డేట్ పంచుకున్నాడు. అభిమానులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

‘నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసినవాళ్లందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రార్థనలకు నేను పొంగిపోయాను. మీ వల్లే నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం కుదుటపడుతోంది. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చు. డాక్టర్లు సూచించిన వాటిని జాగ్రత్తగా ఫాలో అవుతున్నా. కొన్నాళ్లు విశ్రాంతి అవసరం. నావల్ల చాలా పనులు ఆగిపోయాయి. అన్ని పరిస్థితులు మెరుగుపడి డాక్టర్ సూచించిన తర్వాత ముందుకు సాగుతా. అందరికీ హోలీ శుభాకాంక్షలు. త్వరలో కలుద్దాం’ అంటూ తన హెల్త్ అప్ డేట్ గురించి పోస్ట్ చేశారు.