King Movie: షారుక్‌కు విలన్‌గా అభిషేక్‌ బచ్చన్..రూమర్స్‌కు చెక్‌ పెడుతూ బిగ్ బి పోస్ట్

King Movie: షారుక్‌కు విలన్‌గా అభిషేక్‌ బచ్చన్..రూమర్స్‌కు చెక్‌ పెడుతూ బిగ్ బి పోస్ట్

బాలీవుడ్ బిగ్ బి, స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ తన నెక్స్ట్ ఫిలిం షారుఖ్ ఖాన్ తో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై బిగ్ బి స్పందించాడు. ఓ అభిమాని చేసిన ట్వీట్ కు రెస్పాండ్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఒక్క ట్వీట్తో ఫ్యాన్స్లో ఆశలు పెంచాడు. 

ALSO READ | Double Ismart Theatrical Rights: దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్..భారీ ధరతో 'హను మాన్' మేకర్స్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న మూవీ‘కింగ్‌’ (King). ఈ మూవీలో హీరో అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) విలన్‌ రోల్ చేస్తున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ అభిమాని ట్విట్టర్ Xలో స్పందిస్తూ.." షారుఖ్ ఖాన్ తో ‘కింగ్‌’ లో అభిషేక్‌ సర్‌ నెగెటివ్‌ రోల్‌లో ఏ స్థాయి పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తాడో తెలిసిపోతుంది..అల్వేస్ జూనియర్ బచ్చన్" అంటూ పోస్ట్‌ పెట్టాడు.

అభిమాని సందేహానికి అమితాబ్‌ బచ్చన్‌ స్పందిస్తూ..‘‘ఆల్‌ ది బెస్ట్‌ అభిషేక్‌. సరైన సమయమిది’ అంటూ మీడియాలో వస్తున్న రూమర్స్‌కు ఒక్క ట్వీట్ తో చెక్‌ పెట్టారు. అయితే ఇక్కడ బిగ్ బి మాత్రం ఈ మూవీలో అభిషేక్ విలన్ గా నటిస్తున్నట్టు డైరెక్ట్ గా చెప్పకుండా పరోక్షంగా వెల్లడించారు.దీంతో బిగ్ బి అండ్ అభిషేక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

ALSO READ | Prasads Multiplex Tweet: 'కల్కి2898AD'..ఈ పేరు చరిత్ర మర్చిపోదు..ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రభాస్ ప్రభంజనం

ఇంతకుముందు హ్యాపీ న్యూ ఇయర్‌,కభీ అల్విదా నా కెహనా వంటి సినిమాల్లో షారుక్‌- అభిషేక్‌ కలిసి నటించారు.‘రావణ్‌’ సినిమాలో  అభిషేక్‌ నెగెటివ్‌ రోల్ చేసి ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ‘కింగ్‌’ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ ఏడాది ఎండింగ్ లో షూటింగ్‌ షురూ కానుంది. ఈ సినిమాలో షారుక్‌ కూతురు సుహాన కీలకపాత్రలో నటిస్తుంది. సుజయ్‌ ఘోష్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తండ్రీకూతుళ్లు గురుశిష్యులుగా నటించనున్నారట. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం.