KBC 16 యొక్క తాజా ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కి ఓ కంటెస్టెంట్ నుంచి వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. న్యూ ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రితికా కుమారి సింగ్ (Ritika Kumari Singh) తాజాగా కేబీసీ 16 సీజన్‌లో పాల్గొన్నారు.
అమితాబ్తో హాట్ సీట్‌లో కూర్చొన్న రితికా.. ‘సర్ మీ దగ్గర చాలా రకాల సూట్స్ ఉంటాయి. మొత్తం మీ వద్ద ఎన్ని ఉన్నాయి’ అని అమితాబ్ బచ్చన్‌ను అడిగింది.
ఆ ప్రశ్నకు అమితాబ్ నవ్వుతు తనదైన శైలిలో స్పందించారు. ‘ఇది నా సూట్ కాదు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోది. ఈ షో పూర్తయ్యాక దీన్ని తిరిగి ఇచ్చేయాలి. అయితే, నా దగ్గర ఎటువంటి సూట్స్ లేవు. కేవలం పైజమా, కుర్తాలు మాత్రమే ఉన్నాయి’ అని బిగ్‌బీ సమాధానం ఇచ్చారు. దాంతో షోలో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ ఒక్కసారిగా నవ్వేశారు. ‘మీరు జర్నలిస్టు. నేను మీకు నమస్కరిస్తున్నాను. జర్నలిస్టును గౌరవించాలి’ అని అంతకుముందు రితికాతో అమితాబ్ అన్నారు.
అంతేకాకుండా..అమితాబ్ కు బ్రెడ్‌క్రంంబింగ్, గోస్టింగ్, సిట్యుయేషన్‌షిప్ మరియు బెంచ్ వంటి ఆధునిక డేటింగ్ పదాలను పరిచయం చేశారు రితికా.
ఆమె బ్రెడ్ క్రంంబింగ్ అనే పదాన్ని వివరిస్తూ.. “సర్ బ్రెడ్‌క్రంంబింగ్ యే హోతా హై కి లడ్కా లడ్కీ కో హింట్ దేతా హై, లడ్కీ లడ్కా కో హింట్ దేతీ హై, అయితే వో డోనో కమిట్ నై కర్తే కి" (సార్, బ్రెడ్‌క్రంంబింగ్ అంటే ఒకప్పుడు అబ్బాయి ఒక అమ్మాయికి సూచనలు ఇస్తాడు, మరియు ఒక అమ్మాయి అబ్బాయికి సూచనలు ఇస్తుంది, కానీ వారిద్దరూ సంబంధంలో ఉండడానికి లేదా ఏదైనా సీరియస్‌గా ఉండటానికి కట్టుబడి ఉండరు). అని వివరించింది.
షాక్‌కు గురైన బిగ్‌బి దీనిపై స్పందిస్తూ, "ఓహ్! ఉస్కో బ్రెడ్‌క్రంంబింగ్ బోల్తే హై? హమారీ ఉమర్ నికల్ గయీ ఎస్కే లియే? లేకీన్ అగర్ కభీ అఫ్సర్ మిలా తో క్యా బోలేంగే హమ్ ఆయ్ ఆప్ డెల్టిస్ బ్రెడ్ ఖేంగే క్యా? ఐసా కుచ్ (వహీ హమ్ ఓహ్, బ్రెడ్‌క్రంబ్ అని పిలవబడుతుందా? అని అన్నారు. దీంతో అక్కడున్న వారికి నవ్వాగలేదు. ఈ షో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీలైవ్‌లో కూడా టెలికాస్ట్ అవుతుంది.