రష్మిక ఫేక్ వీడియో వైరల్.. స్పందించిన అమితాబ్.. లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్

టెక్నాలజీ పెరగడం వల్ల ఎంత మంచి జరుగుతుందో.. అంతేకంటే ఎక్కువ చెడు కూడా జరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ఆ ప్రభావం ఇంకా ఎక్కువ కనబడుతోంది. రోజుకో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. స్టార్ హీరోయిన్ ల పేస్ లు మార్పింగ్ చేస్తూ.. వాటికి అసభ్యకరమైన వీడియోలను యాడ్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు కొంతమంది ఆకతాయిలు. 

అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika mandanna)కు సంబందించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ లిఫ్ట్ నుండి వస్తున్నట్టుగా ఉంది. ఆ వీడియో చుసిన నెటిజన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. రష్మిక ఏంటి ఇలా తయారయ్యింది అంటూ ఆశ్చర్యపోతూనే ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. అది ఫేక్ వీడియో అని కామెంట్స్ చేశారు. ఆ ఒరిజినల్ వీడియో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ జారా పటేల్(Zara Patel)కు సంబంధించినది. ఆమె వీడియోకి రష్మిక ఫేస్ తో మార్ప్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది.

అయితే.. ఈ మార్పింగ్ వీడియోపై రష్మిక ఫాన్స్, నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి వీడియోలు చేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆదుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ను కోరుతున్నారు. ఇదే విషయంపై తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan ) కూడా స్పందించారు. ఇది ఖచ్చితంగా సీరియస్ ఇష్యూ అని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ విషయంపై రష్మిక ఇప్పటివరకు స్పందించలేదు.