స్విగ్గీలో బచ్చన్ ఫ్యామిలీ ఆఫీసుకు వాటా

స్విగ్గీలో బచ్చన్ ఫ్యామిలీ ఆఫీసుకు వాటా

న్యూఢిల్లీ: త్వరలో ఐపీఓకు రానున్న క్విక్​కామర్స్​ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ స్విగ్గీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబ కార్యాలయం చిన్న వాటాను తీసుకున్నట్లు తెలిసింది. జాతీయ  మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ ఉద్యోగుల నుంచి,  ప్రారంభ పెట్టుబడిదారుల నుంచి వాటాలను కొనుగోలు చేయడం ద్వారా ఈ వాటా తీసుకున్నారు. డీల్​ విలువ ఎంతనేది తెలియరాలేదు. 

ఈ విషయమై స్పందించడానికి స్విగ్గీ నిరాకరించింది. బచ్చన్​ కూడా అందుబాటులోకి రాలేదు.    తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ,  ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 10,414 కోట్ల నిధులను సమీకరించడానికి స్విగ్గీ ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటాదారుల ఆమోదం పొందింది.