![కల్కిపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్](https://static.v6velugu.com/uploads/2024/03/amitabh-bachchan-gave-clarity-on-kalki-movie-release_NsKXftqTjh.jpg)
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఎడి’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మే 9న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయినప్పటికీ సినిమా వాయిదా పడబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్‌పై అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ గురించి తన బ్లాగ్‌లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘కల్కి’ షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్లీ ఆలస్యమైంది. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ముందుగా ప్రకటించినట్టుగా మే 9న సినిమా విడుదల కానుంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మేకర్స్ కృషి చేస్తున్నారు’ అని ఆయన తన బ్లాగ్‌లో రాశారు. ఈ చిత్రం ఎక్కడ వాయిదా పడుతుందో అని టెన్షన్ పడుతున్న ప్రభాస్ అభిమానులు.. బిగ్ బి తీపి కబురుతో సంతోష పడుతున్నారు.