బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాను చురుకుగా వాడుతుంటారనే సంగతి తెలిసిందే. అటూ సినిమాలు.. ఇతరత్రా పనులతో బిజీగా ఉన్నా.. పలు విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. కానీ.. ఆయన చేసిన ఓ పోస్టు తెగ ట్రోలింగ్ అవుతోంది. నెటిజన్లు ఎగతాళిగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఏ మాత్రం సహనం కోల్పోని బిగ్ బి... అదే విధంగా సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది ?
ఉదయం ఎప్పటిలాగానే తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పారు. అయితే.. ఆయన పోస్టు చేసినప్పుడు సమయం 11 దాటి పోయింది. ఈ చిన్న పోస్టే విమర్శలకు దారి తీసింది. ఇంకా ఉదయమా ? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇది ఉదయం కాదు.. ఓల్డ్ మేన్.. మధ్యాహ్నం అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. వీటిపై అమితాబ్ సున్నితమైన సమాధానాలు ఇచ్చారు. తనను హేళన చేసినందుకు థాంక్స్ ముందుగా చెప్పారు. ముఖ్యమైన పనికోసం రాత్రి వేళ చాలా సేపు మెలుకవతో ఉండాల్సి వచ్చిందని.. అందుకే నిద్ర లేవడం ఆలస్యమైందని చెప్పుకొచ్చారు.
లేచిన వెంటనే శుభాకాంక్షలు చెప్పినట్లు.. మీరు బాధపడితే క్షమించాలంటూ పోస్టు చేశారు. మీ వృద్దాప్యంలో మిమ్మల్ని ఎవరూ అవమానించకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సెటైర్స్ వేశారు. ఈ విషయంలో చాలా మంది అమితాబ్ కు మద్దతుగా నిలిచారు. అంత వయస్సులో పనిపట్ల ఎంత నిబద్ధతో ఉన్నారో అర్థం చేసుకోవాలని ఇతర నెటిజన్లు సూచిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం : -
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే...
నేడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 34వ పుట్టినరోజు