నా కంటే పెద్ద స్టార్ అల్లు అర్జున్.. : KBC16లో అమితాబ్ కామెంట్స్

నా కంటే పెద్ద స్టార్ అల్లు అర్జున్.. : KBC16లో అమితాబ్ కామెంట్స్

హిందీలో పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్ పతి 16 ప్రోగ్రాంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రస్తావన రావడంతో ఈ షోని హోస్ట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులోభాగంగా కంటెస్టెంట్ తనకి అల్లు అర్జున్ తోపాటూ అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమని దీంతో సినిమాలు కచ్చితంగా చూస్తానని తెలిపింది. 

దీంతో అమితాబ్ బచ్చన్ ఈ విషయంపై స్పందిస్తూ అల్లు అర్జున్ కి నేను కూడా వీరాభిమానిని అని అన్నాడు. అలాగే బన్నీ టాలెంటెడ్ యాక్టర్ అని, అతనికి దక్కిన అవార్డులకి అర్హుడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే అల్లు అర్జున్ తో నన్ను పోల్చి చూడకండని అన్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా రిలీజ్ అయ్యిందని ఒకవేళ మీరు ఆ సినిమా చూడకుంటే కచ్చితంగా చూడాలని కంటెస్టెంట్ కి సూచించాడు. 

ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ లెజండరీ యాక్టర్ అని, అటువంటి గొప్ప నటుడి నుంచి ప్రసంశలు అందుకోవడం గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తన్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2: ది రూల్ సినిమాకి టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఇప్పటివరకూ పుష్ప 2 దాదాపుగా రూ.700 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. దీంతో తెలుగులోనే కాదు.. బాలీవుడ్ లో కూడా హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అంతేగాకుండా వరల్డ్ వైడ్ రూ.1700 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 3వ స్థానంలో నిలిచింది.