రతన్ టాటా (Ratan Tata) మరణంతో భారత పారిశ్రామిక చరిత్రలో ఓ శకం ముగిసింది. దేశ కీర్తిని ఖండాంతరాలకు చాటిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా అక్టోబర్ 10న పరమపదించింది తెలిసిందే. కాగా టాటా మరణానికి సంతాపం తెలిపిన మొదటి నటుల్లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ఒకరు.
తాజా విషయానికి వస్తే.. కౌన్ బనేగా కరోడ్‌పతి 16 (Kaun Banega Crorepati 16) లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రతన్ టాటాకు తనకు మధ్య జరిగిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ షోకి ఫరా ఖాన్ మరియు బోమన్ ఇరానీ అతిథులుగా రాగా వారితో రతన్ టాటా యొక్క సింప్లిసిటీని పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఈ రిలీజ్ చేసిన ప్రోమోలో అమితాబ్.. రతన్ టాటాతో ఉన్న అనుబంధం గురించి షేర్ చేసుకున్నారు. 'రతన్ టాటా ఎటువంటి వ్యక్తి అనే విషయం చెప్పలేనని… ఎందుకంటే అతను సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తీ అని అన్నారు. అంతేకాదు ఒకసారి రతన్ టాటా తానూ ఒకే విమానంలో లండన్ వెళ్లామని చెప్పారు. మేం లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే రతన్ టాటా తనను పికప్ చేసుకునేందుకు వచ్చిన వారికోసం వెతుకుతున్నారు. దీంతో వారికి ఫోన్ చేయడానికి పక్కనే ఉన్న ఫోన్ బూత్‌కి వెళ్ళారు రతన్ టాటా.అయితే, నేను టాటాకు దగ్గరలోనే నిలబడి ఉన్నాను. అతను నాతో మాట్లాడటానికి వచ్చి.. 'అమితాబ్.. నాకు కొంత డబ్బులు కావాలి అని అడిగారని తెలిపారు. ఇక అతని ఈ గొప్ప స్థాయికి తగిన మాటలు విన్నాక చాలా ఆశ్చర్యం వేసిందని పంచుకున్నారు.
ALSO READ | Kaun Banega Crorepati 16: కౌన్ బనేగా కరోడ్ పతిలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌పై ప్రశ్న
అలాగే ఓ సారి ఫ్రెండ్స్ తో కలిసి ఓకే ఈవెంట్ కి వెళ్ళామని.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలుదేరుతుంటే .. ఇంతలో రతన్ టాటా వచ్చి.. 'నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నానని అడిగారు.. అని చెప్పారు. అసలు మీరు నమ్మగలరా? రతన్ టాటా తన వద్ద కారు లేదని చెప్పడాన్ని..కనీసం ఎవరైనా ఊహించగలరా? అంటూ రతన్ టాటా సింపుల్ లివింగ్ గురించి గుర్తు చేసుకున్నారు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.