అమిత్ షా.. బీజేపీ చాణుక్యుడు

అమిత్ షా బీజేపీలో చాలా కీలకంగా మారారు. బీజేపీని పార్టీలా కాకుండా ఓ కార్పొరేట్​ కంపెనీలా నడుపుతున్నారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. బీజేపీ లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లను పక్కకు నెట్టి పార్టీ లో తాను స్ట్రాంగ్ గా మారారు. ప్రధాని మోడీకి అత్యంత నమ్మకస్తుడిగా పార్టీలో పేరు తెచ్చుకున్నారు. చాలా తక్కువ సమయంలో పార్టీలో స్పీడుగా ఆయన ఎదిగారు.

సిన్మాల్లో కొంతమంది హీరో, హీరోయిన్లను హిట్ పెయిర్ అంటారు. ఫలానా జంట నటిస్తే మినిమం గ్యారంటీ ఉంటుందని ప్రొడ్యూసర్లు కూడా భావిస్తుంటారు. ప్రస్తుతం మన దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా అలాంటి హిట్ పెయిరే.  ఈ జంట ఎక్కడకు వెళ్లినా పార్టీకి ఓట్ల పంటే అని బీజేపీ వర్గా లు భావిస్తుంటాయి. మోడీ టీం కు అమిత్ షా సర్వ సైన్యాధిపతి. పార్టీ లేదా ఎన్నికలకు సంబంధించి ఏ నిర్ణయం కూడా అమిత్ కు చెప్పకుండా మోడీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు ‘అచ్ఛే దిన్’ , ‘సబ్ కే సాథ్ – సబ్ కా వికాస్’వంటి నినాదాలతో ప్రజలను మోడీ ఆకర్షిస్తుంటే మరో వైపు ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన చాణక్య నీతిని అమిత్ షా ప్రదర్శిస్తుంటారు. ఇద్దరి మధ్య మంచి బ్యాలెన్స్ ఉంది. తెరముందు మోడీ కనిపిస్తే, తెర వెనక ఉండి పార్టీ కార్యక్రమాలను అమిత్ చక్కబెడుతుంటారు. సహజంగా అమిత్ షా తాను‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా ఉండటానికి ఇష్టపడరు. ఆయనకు సొంత అజెండా అంటూ ఏమీ ఉండదు. నమ్ముకున్న పార్టీ అధికారంలో కి రావడం, చిరకాల మిత్రుడు మోడీ రెండోసారి ప్రధాని కావడమే ఆయన ముందున్న ఏకైక అజెండా. దీనికోసమే ఆయన ప్రస్తుతం 24 గంటలు కష్టపడుతున్నారు. బీజేపీలో చాలా తక్కువ టైంలోనే అమిత్ షా ఎదిగారు. ఎవరూ ఎదగనంత ఎత్తు కు ఎదిగారు. లాల్ కృష్ణ అద్వానీ,మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లను పక్కనపెట్టి పార్టీలో దూసుకెళ్లిన చతురుడు అమిత్ షా. 2014 లోక్ సభ ఎన్నికల నాటికి అమిత్ షా పెద్దగా ఎవరికీ తెలియదు. 80 లోక్ సభ నియోజకవర్గాలున్నఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 సీట్లు గెలుచుకున్న తర్వాత కానీ షా సత్తా అందరికీ తెలియలేదు. దేశమంతా తిరుగుతూ ప్రధాని మోడీ అయిదేళ్ల  పాలనలో సాధిం చిన ఘన విజయాలను ఎన్నికల ప్రచార సభల్లో వివరిస్తు న్నారు. ‘లో ప్రొఫైల్’ నుంచి ‘హై ప్రొఫైల్’కు మారుతున్నారు.

షా నామినేషన్ మిత్రుల ర్యాలీ

గాంధీనగర్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన అమిత్ షా, అట్టహాసంగా నామినేషన్ వేశారు. బీజేపీ సీనియర్ నేతలు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీయే కాదు రాం విలాస్ పాశ్వాన్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఉద్ధవ్ ఠాక్రే వంటి అలయన్స్ లీడర్లు కూడా ఆ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నాలుగు కిలో మీటర్లమేర రోడ్ షో నిర్వహించారు. వాజ్ పేయి హయాంలో పార్టీలో నెంబర్ టూగా ఉన్న ఎల్‌.కె.అద్వానీ సొంత నియోజకవర్గమైన గాంధీనగర్ ను తన లోక్ సభ ఎంట్రీకి అమిత్ షా ఎంపిక చేసు కోవడం విశేషమే. అమిత్ షా తీరు చూస్తే ఆయన ఎల్లకాలం తెర వెనక ఉండే రాజకీయ నాయకుడు కాదన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇన్నాళ్లూ తెర వెనుక ఉన్న షా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా  తెర ముందుకు వస్తున్నారు. తనను తాను ఎస్టాబ్లిష్  చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీనగర్ నుంచి ఆయన గెలిస్తే ఎన్నోఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్డీయే మరోసారి సర్కార్ ని ఏర్పాటు చేస్తే అందులో అమిత్ షా నెంబర్ టూ అవడం ఖాయమంటు న్నారు. అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసు కునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.  ప్రభుత్వం ఏర్పాటు కు అవసరమైన మెజారిటీ బీజేపీకి రాకపోతే అప్పుడు కూడా మిత్రపక్షాలతో సంప్రదింపులు జరపడానికి పార్టీకి అమిత్ షా యే అవసమన్నది పరిశీలకుల అంచనా.

ఎలక్షన్‌ మెషీన్‌ 

ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా, రాజకీయ ఎత్తు గడల్లో అమిత్ షా దిట్ట అనే విషయాన్ని అంగీకరించి తీరాల్సిం దే. దేశంలో ఏ మూల ఎన్నికలు జరిగినా,అమిత్ షా వెళితే చాలు, పార్టీ గెలిచినట్లే అని బీజేపీ కార్యకర్తలు భావిస్తారు. బీజేపీ ఇన్నర్ సర్కిల్ లో షాకి‘ఎలెక్షన్ మెషీన్’ అని  పేరు. కిందటేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలు-చుకుందంటే ఆ క్రెడిట్ షాదే. కర్ణాటకలోని మొత్తం30 జిల్లాల్లో సుడిగాలిలా ఆయన పర్యటిం చారు.ప్రతి జిల్లాలో నూ రాజకీయ పరిస్థితు లను స్వయంగాఅంచనా వేశారు. అందుకు అనుగుణంగా లోకల్లీడర్లకు , కేడర్ కు గైడ్ లైన్స్ ఇచ్చారు. కర్ణాటకలోనిఅన్ని జిల్లాలను చుట్టేసిన బీజేపీ తొలి అధ్యక్షుడిగా రికార్డు కెక్కా రు.

వారణాసి ఐడియా అమిత్ షాదే

2014 లోక్ సభ ఎన్నికల్లో సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి బరిలోకి దిగాలని ఫిక్స్ అయిన మోడీ బుర్రలోకి వారణాసి పేరును ఎక్కించిం ది అమిత్ షానే అంటారు.వారణాసి నుంచి మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం యూపీ పైన పడుతుందని, ఫలితంగా మెజారిటీ సీట్లు తమ ఖాతాలో పడతాయన్నది షా అలోచన అని పొలిటికల్ సర్కిల్స్ సమాచారం.  దీంతో వారణాసికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మురళీ మనోహర్ జోషిని కాన్పూర్ కు పంపిం చారు. వారణాసి నుంచి పోటీకి మోడీని ఒప్పించి గెలిపించారు.గుజరాత్ కు చెందిన అమిత్ షా పూర్తిగా నరేంద్రమోడీ డిస్కవరీ. షా ఆరెస్సె స్ ప్రోడక్ట్. కొంతకాలం ఏబీవీపీలో పనిచేశారు. తరువాత బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంచెలంచెలుగా ఎదిగారు. నరేంద్రమోడీకి దగ్గరయ్యారు. 2003 లో నరేంద్ర మోడీ కేబినెట్లో చేరారు. అమిత్ పై ఎంత నమ్మకం కుదిరిందంటే… హోం మినిస్ట్రీతో పాటు మొత్తం 12 శాఖల బాధ్యతలను మోడీ అప్పగించారు. అప్పటి నుంచి మోడీతో అమిత్ షా జుగల్ బందీ కొనసాగుతోంది.నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయమంటూ గతంలో కొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయి. నితిన్ గడ్కరీ,అరుణ్ జైట్లీ ఇందులో ముఖ్యమైనవి. తర్వాత ఈ లీడర్లంతా మెల్లగా సర్దుకున్నారు. ‘మోడీ యే మా లీడర్’అంటూ విధేయత ప్రదర్శిం చారు. ఈ నేపథ్యంలో మోడీకి అమిత్ షా ప్రత్యామ్నాయం అవుతారా అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది. అలా ఎన్నటికీ జరగదంటున్నారు రాజకీయ పండితులు. అమిత్ షా నూటికి నూరుశాతం మోడీ డిస్కవరీ అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

కార్పొరేట్ కంపెనీగా మార్చారా ?

బీజేపీలో కీలకంగా మారినా అమిత్ షాపై విమర్శలు చాలా ఉన్నాయి. రాజకీయ పార్టీ అయిన బీజేపీని ఒక కార్పొరేట్ కంపెనీలాగా మార్చేశారని ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. సంఘ్ పరివాత్ సిద్ధాం తాలకు దూరంగా బీజేపీని కూడా ఒక సాదా సీదా రాజకీయ పార్టీగా మార్చేశారన్నది ఆయన పై ఉన్న ప్రధాన విమర్శ. ప్రధాని మోడీ స్టయిల్ ను అనుకరిస్తారన్న విమర్శ కూడా అమిత్ షా పై ఉంది. అమిత్ షా ఒకప్పుడు స్టా క్​ మార్కెట్​ బ్రోకర్ . కార్పొరేట్​ బిజినెస్ లోని ఎత్తుగడలను పార్టీకి కూడా అన్వయిం చారని విమర్శిస్తారు.