ఢిల్లీలో అబద్ధాల పాలన ముగిసింది: షా

ఢిల్లీలో అబద్ధాల పాలన ముగిసింది: షా

ఢిల్లీలో అబద్ధాలు, అవినీతి పాలన అంతమైంది. అభివృద్ధిలో కొత్త యుగం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు అహంకారం, అరాచకత్వాన్ని ఓడించారు. కాలుష్యమయమైన యమున, కలుషిత తాగునీరు, గుంతలమయమైన రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు, వీధికో మద్యం దుకాణంపై ప్రజలు ఓట్ల ద్వారా గట్టిగా జవాబు చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అభివృద్ధి చెందిన రాజధాని అవసరమని జనం తెలుసుకున్నారు. 

ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నమ్మడం వల్లే ఇంతటి ఘన విజయం సాధించాం. ఇది ‘మోదీ కీ గ్యారెంటీ’ విజయం, మోదీ అభివృద్ధిపై ఢిల్లీ ప్రజల నమ్మకం. డబుల్ ఇంజిన్ సర్కారు ఢిల్లీలో అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.