భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు

భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు

చార్మినార్ లోని భాగ్యలక్ష్మి టెంపుల్ ను దర్శించుకున్నారు కేంద్రమంత్రి  అమిత్ షా. ఆలయ అధికారులు అమిత్ షా కు ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వెంట బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

పూజల తర్వాత గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ లో ఎన్నికలపై నేతలతో సమీక్షించనున్నారు. అనంతరం డిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా.

అంతకుముందు బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ నేతలు బూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, వివేక్ వెంకట స్వామి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు.