రేపు కరీంనగర్ లో అమిత్ షా మీటింగ్

రేపు కరీంనగర్ లో అమిత్ షా మీటింగ్

కరీంనగర్ :  లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రచారం స్పీడప్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశ మంతటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈసారి సౌత్ ఇండియా పైనా ఎక్కువగా ఫోకస్ చేశారు. మహబూబ్ నగర్, హైదరాబాద్ సభల్లో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. మహబూబాబాద్ లో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం నాడు బహిరంగ సభ నిర్వహించారు. ఇపుడు అమిత్ షా కూడా ప్రచార రంగంలోకి దిగుతున్నారు.

ఎన్నికల ప్రచారం కోసం రేపు గురువారం కరీంనగర్ వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తోంది. బండి సంజయ్ ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సభకు పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించి… బలప్రదర్శన చేయాలని బీజేపీ భావిస్తోంది.