- అమ్మ ఆదర్శ స్కూల్పనులు స్పీడప్
- జిల్లాలో 291 స్కూళ్లలో వర్స్క్
- మౌలిక వసతుల కల్పనతో స్కూళ్లకు న్యూ లుక్
జనగామ, వెలుగు : మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగవంతం చేశారు. ప్రధానంగా తాగు నీరు, కరెంటు, టాయిలెట్స్ సమస్యలపై దృష్టి సారించారు. జనగామ జిల్లాలో 291 పాఠశాలల్లో ఈ పనులు చేపడుతున్నారు. పనులు త్వరగా కంప్లీట్ చేయాలని ముందుకు సాగుతున్నారు.
పనులు స్పీడప్..
జనగామ జిల్లాలో 291 బడులను అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి ఎంపిక చేసి పనులు చేస్తున్నారు. ఇందుకోసం రూ. 9.38 కోట్లను సర్కారు మంజూరు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి స్టూడెంట్లకు చక్కటి వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించింది. దీంతో ఒక్కో స్కూల్ లో అక్కడి అవసరాల ఆధారంగా ఆఫీసర్లు నిధులను వెచ్చించి, పనుల్లో వేగం పెంచారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నిత్యం స్కూల్స్ విజిట్లతో హడలెత్తించారు. ఇప్పటి వరకు 117 స్కూల్స్ లో పనులు దాదాపు పూర్తవగా, 174 స్కూల్స్‌ల్లో వివిధ దశల్లో ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆయా పనులు పూర్తి అయితే స్కూల్స్ కొత్త లుక్ సంతరించుకోనున్నాయి.
పనుల పూర్తికి చర్యలు..
అమ్మ ఆదర్శ పాఠశాలల కింద స్కూల్స్ ను డెవలప్ చేస్తున్నాం. స్టూడెంట్లకు మౌలిక వసతుల కల్పన పనులు స్పీడ్‌గా చేపడుతున్నం. జిల్లాలో 291 స్కూల్స్ ఎంపిక చేయగా, 117 చోట్ల పనులు పూర్తి చేశాం. బడుల ప్రారంభం నాటికి పనుల పూర్తికి తగు చర్యలు తీసుకుంటున్నం.
- కే రాము, డీఈవో, జనగామ