వర్ధన్నపేట/ములుగు, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని శ్రీదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని సరస్వతీ దేవీగా అలంకరించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో పూజారి కలకోట శ్రవణ్‌కుమార్, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ములుగు రామాలయంలో ఉత్సవ సమితి అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య హాజరై భక్తులకు అన్నదానం చేశారు.