అమ్మ రాజశేఖర్ తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

అమ్మ రాజశేఖర్ తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

కొరియోగ్రాఫర్  అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా, ఆయన కొడుకు రాగిన్ రాజ్‌‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘తల’.  అంకిత నాన్సర్ హీరోయిన్. పి శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు.  శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య, నటుడు ప్రభాకర్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని విష్ చేశారు. దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ‘గత కొన్ని నెలలుగా ఎంతో ఒత్తిడితో ఉన్నా.

ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. జీవితంలో చాలా స్ట్రగుల్ చూశా. అమ్మ రాజశేఖర్‌‌‌‌కు ఏమైంది అని ప్రశ్నించిన వాళ్లకు ఈ సినిమాతో సమాధానం చెబుతా. నా కొడుకు రాగిన్ రాజ్‌‌ను ఆశీర్వదించాలని కోరుతున్నా’ అన్నారు. హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ ‘ఇందులో కథ ప్రకారం నా వయసు పద్దెనిమిది. ఆ వయసు కుర్రాడు తల్లి ప్రేమ కోసం ఎంతదూరం వెళ్లాడు అనేది మెయిన్ కాన్సెప్ట్‌‌. యాక్షన్, రొమాన్స్ లాంటి కమర్షియల్ అంశాలు ఉన్నాయి’ అని చెప్పాడు.  ఛాలెంజింగ్‌‌ క్యారెక్టర్ చేశానని నటి ఎస్తేర్ చెప్పింది.  ‘అన్ని రకాల ఎమోషన్స్‌‌తో ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేసే చిత్రమిది. ఈ సినిమాతో మునుపటి అమ్మ రాజశేఖర్‌‌‌‌ను చూస్తారు’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  నటీనటులు రోహిత్,  విజి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.