
గద్వాల టౌన్, వెలుగు : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం గద్వాల టౌన్ లో అమ్మవార్లను రూ. 4 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ధనలక్ష్మి దేవిగా, మండపాన్ని 3 కోట్ల 51లక్షల10 వేల116 రూపాయలతో తీర్చిదిద్దారు. అదేవిధంగా శ్రీ శక్తి స్వరూపిణి తాయమ్మ టెంపుల్ లో అమ్మవారిని రూ. 51 లక్షల నగదుతో అలంకరించారు.