యూసీహెచ్ఎస్​కు బట్టల వితరణ

యూసీహెచ్ఎస్​కు బట్టల వితరణ

పంజాగుట్ట, వెలుగు: తన తల్లి జ్ఞాపకార్థం ఓ ఎన్ఆర్ఐ మహిళ అమీర్​పేటలోని అర్బన్​కమ్యూనిటీ హెల్త్​సెంటర్​స్టాఫ్​కు బట్టలు పంపిణీ చేసింది. ఆపరేషన్​టైంలో డాక్టర్లు, పేషెంట్లు, సిస్టర్స్​వేసుకునే దుస్తులను అందజేసింది. ఎస్సార్​నగర్​కు చెందిన తిరుమల అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల సిటీకి వచ్చిన తిరుమల సోమవారం అమీర్​పేటలోని హాస్పిటల్ కు చేరుకుని బట్టలు అందజేశారు. ఆర్ఎంఓ డాక్టర్​వినాయక్, డాక్టర్లు మహేశ్, రమాప్రియ పాల్గొన్నారు.