ఎయిర్ ఇండియా విమానంలో బుల్లెట్లు కలకలం

ఎయిర్ ఇండియా విమానంలో బుల్లెట్లు కలకలం

గత 15 రోజులుగా దేశీయ విమానయాన సంస్థలను బాంబు బెదిరింపు సందేశాలు బెంబేలెత్తిస్తున్న విషయం విధితమే. ప్రయాణికులతో బయలుదేరిన ఫలానా విమానానంలో బాంబు పెట్టానని సందేశం పంపడం.. తీరా తనిఖీ చేస్తే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడం.. ఇదే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో దుబాయ్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమాన( AI916)లో బుల్లెట్లు కలకలం రేపాయి. 

విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాక.. ప్రయాణీకులందరూ కిందకు దిగిపోయారు. అనంతరం సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తుండగా, ఒక ప్రయాణికుడి సీటు వద్ద క్యాట్రిడ్జ్ కంటపడింది. వెంటనే సిబ్బంది పైఅధికారులకు సమాచారం అందించారు. ఆ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ఎవరు..? ఏ దేశస్తుడు..? వంటి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఈ ఘటనపై ఎయిరిండియా విమానయాన సంస్థ భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.