క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేస్తే.. ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలుసు. కానీ.. కొందరికి చేయడం బద్ధకం. అలాంటివాళ్లకు ఈ వైబ్రేటింగ్ మెషిన్ బాగా ఉపయోగపడుతుంది. దీంతో సులువుగా ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. ట్విన్జెన్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ మెషిన్ మీద కాళ్లు లేదా చేతులు పెట్టి ఎక్సర్‌సైజ్ చేస్తే.. కండరాలను ఉత్తేజపరుస్తుంది. దానివల్ల క్యాలరీలు, కొవ్వు వేగంగా కరుగుతాయి. దీన్ని బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ చేసుకుని స్పీకర్‌గా కూడా వాడుకోవచ్చు.
ఇందులో మసాజ్ ఫంక్షన్ కూడా ఉంది. దీనికి ఉండే ఎల్ఈడీ స్క్రీన్ మీద ఎక్సర్‌సైజ్ చేసిన టైం, కరిగిన క్యాలరీల డేటా పూర్తిగా చూపిస్తుంది. దీన్ని రిమోట్‌తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇది కాంపాక్ట్ సైజులో వస్తుండడంతో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. యాంటీ-స్లిప్ కోటింగ్ డిజైన్ వల్ల ఎక్కడైనా పెట్టుకుని వాడుకోవచ్చు. దీనిపై ఎక్సర్‌సైజ్ చేస్తే.. మజిల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు. ధర 9,999