హైదరాబాద్: హెల్త్ టెక్, టెలిమెడిసిన్, గృహోపకరణాలలో స్మార్ట్ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్కు చెందిన యాంపివో స్మార్ట్ టెక్నాలజీస్ రూరల్ ట్రేడ్, డిజిటల్ టిక్కెట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది.
యూజర్ల అవసరాలను తీర్చడానికి డిజిటల్, ఫిజికల్సొల్యూషన్స్ అందిస్తామని తెలిపింది. రాబోయే ఆర్నెళ్లలో ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తారు. 15 నెలల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెడతారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు టికెట్లను అందించడానికి, ఉత్పత్తుల కొనుగోలు కోసం యాప్ను అందుబాటులోకి తెస్తామని యాంపివో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సాయినాథ్ రెడ్డి అన్నారు.