హైదరాబాద్, వెలుగు : అశోక్ లేలాండ్ వెహికల్స్కు ఉన్న అతిపెద్ద డీలర్లలో ఒకటైన ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎంపీఎల్) తన అత్యాధునిక సర్వీసు సెంటర్ను తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభించింది. దీనికి వందకు పైగా సర్వీసు స్టేషన్ల నెట్వర్క్ ఉంది. ఈ టచ్ పాయింట్లు ఉత్తర్ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించాయి.
ఇప్పుడు మంచిర్యాలలో కొత్త ఆఫ్టర్ సేల్స్ సర్వీసు సెంటర్ ప్రారంభించడంతో, ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అసాధారణ సేవలను అందిస్తామని సంస్థ తెలిపింది. ఈ సర్వీసు కేంద్రం 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అత్యాధునిక సదుపాయాలతో ఆరు సర్వీస్ బేలు ఉన్నాయి.