- మూడు నెలల పాటు సఫారీ, టూరిజం నిలిపివేత
- అక్టోబర్ 1 నుంచి పునఃప్రారంభం
అమ్రాబాద్, వెలుగు : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ, టూరిజం వంటి సేవలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం జంతువుల ప్రత్యుత్పత్తి కాలం అయినందున మూడు నెలల పాటు అడవిలోకి ఎవరినీ అనుమతించబోమని డీఎఫ్‌వో రోహిత్ గోపిడీ తెలిపారు. ఈ టైంలో వన్యప్రాణులు (ముఖ్యంగా పెద్దపులి) మేట్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తాయి. ఇందులో భాగంగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతుంటాయని
ఈ టైంలో మానవ అలికిడి కనిపించినా జంతువులు ఇబ్బందులు పడుతాయన్నారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సోమవారం నుంచి సెప్టెంబర్ 31 వరకు రిజర్వ్ ఫారెస్ట్‌లోకి అనుమతి నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తిరిగి అక్టోబర్ 1 నుంచి సఫారీ, టూరిజం పునఃప్రారంభం అవుతుందని తెలిపారు. స్థానిక ప్రజలు, పర్యాటకులు సహకరించాలని డీఎఫ్‌వో కోరారు.