- జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి కాట బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన రొనాల్డ్ రోస్ బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో ఆమ్రపాలి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్‌సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు.
అంతకు ముందు జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బాధ్యతలు అప్పగించిన రొనాల్డ్ రోస్, ఆమ్రపాలికి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బల్దియాలోని ఉన్నతాధికారులు ఆమెను కలిసి బొకేలు అందజేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, శేరిలింగంల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
ఈవీడీఎం డైరెక్టర్‌గా రంగనాథ్
జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్(ఈవీడీఎం) డైరెక్టర్ గా సీనియర్ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ బుధవారం బుద్ధభవన్ లో బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ఈవీడీఎం డైరెక్టర్ గా పనిచేసిన ప్రకాశ్‌రెడ్డి టూరిజం ఎండీగా నియమితులైన సంగతి తెలిసిందే.వాటర్ బోర్డు ఎండీగా అశోక్ రెడ్డివాటర్బోర్డు నూతన ఎండీగా కె.అశోక్ రెడ్డి బుధవారం ఖైరతాబాద్ లోని హెడ్డాఫీసులో బాధ్యతలు చేపట్టారు. బోర్డులోని ఉన్నతాధికారులు ఎండీకి ఘన స్వాగతం పలికారు.