
బీజేపీని భ్రష్టు పట్టించేలా అన్ని కేంద్రానికి చెప్పే చేస్తున్నామని వైసీపీ తప్పుడు ప్రకటనలు చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆయన సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్థిక అంశాలతో పాటు రాజధాని అంశంపైన కూడా తాము చర్చించామన్నారు. రాజధాని తరలింపు పై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని అన్నారు.
రాజధాని తరలింపుపై కేంద్రం అనుమతి అవసరం ఉండదని.. అలాఅని .. కేంద్రం జోక్యం చేసుకోదని…. పవన్ అన్నారు. రాజధాని తరలింపు అంత ఆషామాషీ వ్యవహారం కాదనీ.. అమరావతియే ఏపీకి శాశ్వత రాజధాని అని పవన్ అన్నారు. బీజేపీతో కలిసి బలమైన కార్యాచరణతో జనంలోకి వెళ్తామని ఆయన చెప్పారు.