బాంద్రా: అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సండే కోర్టు ఆదేశాలిచ్చింది. కానీ... విచారణ కోసం పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవీత్ కౌర్ దంపతులు ప్రకటించారు. దీంతో అధికార శివసేన పార్టీ నుంచి రాణా దంపతులకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. శివసేనకు చెందిన నాయకులు, కార్యకర్తలు.. నవనీత్, రవి రాణాపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వారి ఇంటి ముందు ధర్నాకు దిగారు. రాణా దంపతుల వ్యాఖ్యల వల్ల దేశంలో అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందంటూ శివసేన నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం రాణా దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అండ్ సన్‌డే కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారిని మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్‌కు పంపింది. మరోవైపు ఏప్రిల్ 29 న వీరిద్దరి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. రాణా దంపతులపై దేశ ద్రోహం అభియోగం మోపడాన్ని ఆమె ఖండించారు.
Maharashtra | Amravati MP Naveneet Rana & husband MLA Ravi Rana sent to 14-days of judicial custody by Bandra Magistrate's Court.
— ANI (@ANI) April 24, 2022
Bail application kept for hearing on 29th April, Mumbai Police asked to file their say on bail plea on 27th April. pic.twitter.com/2gAvEEAH6L