సీఎం బామ్మర్దికి పనులు కట్టబెట్టారు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్(అమృత్) పనుల కాంట్రాక్టుల ఖరారులో భారీ అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయల పనులను కట్టబెట్టారని విమర్శించారు.
ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి తన పదవిని కోల్పోయే అవకాశం ఉందన్నారు.