అంతా అమృతే చేసింది.. కోర్టు తీర్పు తర్వాత అమృత చెల్లి ఆందోళన

అంతా అమృతే చేసింది.. కోర్టు తీర్పు తర్వాత అమృత చెల్లి ఆందోళన

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం ( మార్చి 10 ) సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో A2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు, మిగతా ఆరుగురు నిందితులకు జీవితఖైదు విధించింది. కోర్టు జీవితఖైదు విధించిన దోషుల్లో అమృత బాబాయ్ శ్రవణ్ రావు కూడా ఉన్నారు. ఈ కేసులో A6  గా ఉన్నారు శ్రవణ్ రావు. ఈ క్రమంలో ప్రణయ్ హత్య కేసుతో శ్రవణ్ రావుకు సంబంధం లేదని అతని కుటుంబసభ్యులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కేసుతో తన తండ్రికి సంబంధం లేదని.. అంతా అమృతే చేసిందని ఆరోపించింది శ్రవణ్ రావు కూతురు, అమృత చెల్లి ( బాబాయ్ కూతురు ).

తన తండ్రి తప్పు చేయలేదని.. అమృత చెల్లి బోరున విలపించింది. ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకున్నా అమృత తన తండ్రిని కావాలనే ఇరికించిందని ఆరోపించింది శ్రవణ్ రావు కూతురు.. దీనికి అంతటికి కారణం అమృతనే అని.. ఆవేదన వ్యక్తం చేసింది. ప్రణయ్ హత్యతో శ్రవణ్ రావుకు సంబంధం లేదని ఆయన కుటుంబం మొదటి నుంచి వాదిస్తోంది.

ALSO READ | చంపుకోవడం కరెక్ట్ కాదు.. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి: కోర్టు జడ్జిమెంట్‎పై ప్రణయ్ తండ్రి హర్షం

కాగా.. తన కొడుకు ప్రణయ్ హత్య కేసు తీర్పుతో ఇకనైనా పరువు హత్యలు ఆగిపోవాలని ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి అన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ సెషన్ కోర్టు సోమవారం (మార్చి 10) తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం.. మిగిలిన దోషులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి మీడియాతో మాట్లాడారు. నల్గొండ కోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలని అన్నారు

ఈ తీర్పుతో దోషులు కుటుంబాలు కూడా బాధపడుతుంటాయి.. కానీ ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారకరమని అన్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఐదున్నర సంవత్సరాలు కోర్టు తీర్పుకై వేచి చూశామని.. ఈ తీర్పుతో తృప్తి చెందామని తెలిపారు. మొదటి నుంచి కేసుకు పూర్తిస్థాయిలో సహకరించిన డీఎస్పీ శ్రీనివాస్‎కి కృతజ్ఞతలు.. వందమంది సాక్షులతో.. 1600ల పేజీల చార్జిషీట్‎తో అప్పటి ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసును నిక్కచ్చిగా విచారించారన్నారు ప్రణయ్ తండ్రి బాలస్వామి.