తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కల్తీ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తు్న్నాయి. గతకొన్ని రోజులుగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆ నెయ్యిని అమూల్ డైరీనే సప్లై చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగుతుంది. దీనిపై అమూల్ కంపెనీ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. తిరుమలకు ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని అమూల్ డైరీ స్పష్టం చేసింది. ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ‘ISO సర్టిఫికేట్ పొందిన మా అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలలో అమూల్ నెయ్యి పాలతో మాత్రమే తయారు చేస్తామని పేర్కొన్నారు. అమూల్ నెయ్యి ప్యూర్ క్వాలిటీ పాల కొవ్వుతో తయారు చేయబడింది. మా డెయిరీల వద్ద స్వీకరించే పాలు స్వచ్ఛమైనవి.’ అని పేర్కొంది.
Issued in Public Interest by Amul pic.twitter.com/j7uobwDtJI
— Amul.coop (@Amul_Coop) September 20, 2024
అమూల్ పాల ఉత్పత్తులకు కఠినమైన క్వాలిటీ టెస్టులు చేస్తామని చెప్పుకొచ్చింది. తిరుపతి ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వుల అవశేశాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read :- Telangana Tour : హైదరాబాద్ నుంచి రూట్ మ్యాప్ ఇలా..?
ల్యాబ్ రిపోర్ట్ లో కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వుతో సహా పాలేతర కొవ్వును వాడుతున్నట్లు తేలిందని టీడీపీ ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి ఆరోపించారు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యి స్వచ్చమైనది అని.. టీడీపీ కావాలనే దాన్ని మతపరమైన రాజకీయం చేస్తోందని వైసీపీ నాయకులు ఆరోపణలను ఖండిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈ అంశంపై సమగ్ర నివేదికను కోరగా, ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.