లీటర్‌పై రూ.2.. అమూల్ పాల ధరలు పెంపు

 లీటర్‌పై రూ.2.. అమూల్ పాల ధరలు పెంపు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమూల్ పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు..  2024 జూన్ 3 సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లుగా వెల్లడించింది. గేదే పాలు 500 మి.లీ ప్యాకెట్‌పై రూ.2, లీటర్ పాల ప్యాకెట్‌పై రూ.3 పెంచింది.అమూల్  గోల్డ్ పాలపై లీటర్‌కు రూ.2, హాఫ్ లీటర్‌కు రూ.1 చొప్పున పెంచినట్లు పేర్కొంది. 

ఆవు పాలు హాఫ్ లీటర్ ప్యాక్‌, లీటర్ ప్యాక్‌పై రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  పాల ఉత్పత్తి వ్యయం పెరిగిన క్రమంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలోఅమూల్ పాల ధరను పెంచింది.

 పెరిగిన తాజా ధరలను ఒకసారి పరిశీలిస్తే..  అమూల్ గోల్డ్ 500 మిల్లీలీటర్ల అమూల్ గోల్డ్ ధర రూ.33కి పెరగగా, ఒక లీటర్ పాల ప్యాకెట్ ధర రూ.64 నుంచి రూ.66కి పెరగింది.   అమూల్ గేదె పాల ధర రూ.36కి పెరిగింది. అమూల్ శక్తి ధర రూ.30కి పెరిగింది. ఎమ్మార్పీలో కేవలం 3, 4 శాతం పెంచామని, ఇది ఆహార ద్రవ్యోల్బణంతో పోల్చితే చాలా తక్కువ అని జీసీఎంఎంఎఫ్ పేర్కొంది.