ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్ ఫేక్ దేన్నీ వదలడం లేదు. ఇటీవల సెలబ్రెటీల ఫొటోలు మార్ఫింగ్ తో డీప్ ఫేక్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. నటి రష్మిక మందన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు డీప్ ఫేక్ బాధితులు కావడంతో కేంద్రం ప్రభుత్వం దీనిని సీరియస్ తీసుకుంది.. దీప్ ఫేక్ అరికటేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో ఇన్ వాల్వ్ అయిన వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అయినప్పటికీ డీప్ ఫేక్ మరక పడుతూనే ఉంది. తాజాగా అమూల్ బ్రాండ్ పై కూడా డీప్ ఫేక్ మరక పడింది.
అమూల్ సంస్థ జున్నును శరం పేరుతో మార్కెట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి AI ద్వారా సృష్టించినవని.. అటువంటి ఉత్పత్తులను మేం మార్కెట్లోకి విడుదల చేయలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది.
శరం పేరుతో కొత్త రకం అమూల్ చీజ్ గురించి వాట్సాప్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలో ఫేక్ మేసేజ్ ఫార్వార్డ్ అవుతుంది.దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అమూల్ సంస్థ తేల్చి చెప్పింది. వైరల్ అవుతున్న పిక్చర్ లో అమూల్ లోగోతో ఆవపిండి పసుపు ప్యాకెట్, పెద్ద ఫాంట్ లో శరం అనే పదాన్ని చిత్రీకరించారు. దాని తర్వాత హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ లో జున్ను అనే పదాన్ని రాశారు. ఉర్దూ, హిందీ లో శరమ్ అంటే సిగ్గు అని అర్థం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేశారు. డెయిరీ దిగ్గజం తో ఎలాంటి సంబంధం లేదని అమూల్ స్పష్టం చేసింది. బ్రాండ్ పేరు చెడగొట్టేందుకే ఇలాంటి డీప్ ఫేక్ చిత్రాలను ఫార్వార్డ్ చేస్తున్నారని చెప్పారు. ఈ పోస్టుల ద్వారా తప్పుడు సమాచారం సృష్టించి వినియోగదారులను అనవసరమైన భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలిపింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమూల్ కు ఇలాంటివి కొత్తేమి కాదు. గతంలో డెయిరీ దిగ్గజం అమూల్ లస్సీ ప్యాకెట్ లో ఫంగస్ ఉందని సోషల్ మీడియా లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఫేక్ అని కేవలం వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని కొట్టిపారేసింది.