-
తిరుపతి లడ్డూలో ఆ కంపెనీ నెయ్యి ..
వాడారని ప్రచారం చేసిన ఏడుగురిపై కేసు
అహ్మదాబాద్: తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో తమ నెయ్యి వాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నెటిజన్లపై అమూల్సంస్థ మండిపడింది. ఈ మేరకు పలువురు ట్విట్టర్ యూజర్లపై గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. ఈమేరకు పోలీసులు ఏడుగురు యూజర్లపై ఎఫ్ఐఆర్నమోదు చేశారు. నిందితులపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
ఎఫ్ఐఆర్ప్రకారం.. లడ్డూల తయారీకి ఉపయోగించే జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి అమూల్ బ్రాండ్‌కు చెందినదని ట్విట్టర్లో ఏడు వేర్వేరు హ్యాండిల్స్నుంచి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు. ఇది తమ ప్రతిష్టకు భంగం కలిగించిందని అమూల్బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కోఆపరేటివ్మిల్క్మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) పేర్కొన్నది. కాగా, తాము ఎన్నడూ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేయలేదని జీసీఎంఎంఎఫ్ పేర్కొన్నది.
తమ ప్రొడక్ట్స్ క్వాలిటీకి తగ్గట్టు ఉంటాయని తెలిపింది. తాము కస్టమర్లకు ప్రీమియం నెయ్యిని అందజేస్తున్నట్టు పేర్కొంది. అమూల్36 లక్షలమంది రైతుల కుటుంబాలకు చెందినదని, ఈ తప్పుడు సమాచారం వారి జీవనోపాధిపై ఎఫెక్ట్ చూపిస్తుందని తెలిపింది. అందుకే చట్టప్రకారం తాము చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.