అమూల్​ రెవెన్యూ రూ.65వేల కోట్లు

అమూల్​ రెవెన్యూ రూ.65వేల కోట్లు

న్యూఢిల్లీ: అమూల్​ బ్రాండ్‌తో పాలు, పెరుగు వంటి డెయిరీ ప్రొడక్టులను అమ్మే గుజరాత్​ కో–ఆపరేటివ్​మిల్క్​ మార్కెటింగ్​ఫెడరేషన్​లిమిటెడ్​(జీసీఎంఎంఎఫ్​) 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.65 వేల కోట్ల ఆదాయం సంపాదించింది. ఏడాది లెక్కన ఇది 11 శాతం పెరిగింది. 

అన్ని విభాగాల్లో అమ్మకాలు పెరగడంతో రాబడి పెరిగిందని ఎండీ జయేన్​మెహతా చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో జీసీఎంఎంఎఫ్ ఆదాయం ఏడాది లెక్కన ఎనిమిది శాతం పెరిగి రూ.59,259 కోట్లుగా రికార్డయింది. 

అన్​–డూప్లికేటెడ్​ విధానంలో ఆదాయం రూ.90 వేల కోట్లు ఉందని ఫెడరేషన్​ ప్రకటించింది. అమూల్​ రోజూ మూడు కోట్ల లీటర్ల పాలు అమ్ముతుంది. 50 దేశాలకు డెయిరీ ప్రొడక్టులను ఎగుమతి చేస్తుంది.