- అమూల్ లీటర్‌పాల ప్యాక్‌పై రూపాయి తగ్గింపు
న్యూఢిల్లీ: అమూల్ బ్రాండ్‌తో పాలు అమ్మే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) దేశ మొత్తం మీద లీటర్ ప్యాక్ పాల రేటును ఒక రూపాయి తగ్గించింది. కేవలం ఒక లీటర్ ప్యాక్ ధరలను మాత్రమే తగ్గించింది.
అమూల్ గోల్డ్ మిల్క్ ధర లీటర్‌కు రూ.68 నుంచి రూ.67 కి, అమూల్ తాజా ధర లీటర్‌కు రూ.56 నుంచి రూ.55 కి తగ్గాయి. జీసీఎంఎంఎఫ్ 2023–24 లో రూ.59,445 కోట్ల రెవెన్యూ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రెవెన్యూ రెండంకెల వృద్ధి సాధిస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. కాగా, ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రోజుకి సగటున 310 లీటర్ల పాలను మేనేజ్ చేసింది.