భారతీయులను వెంటాడుతున్న ప్రోటీన్ లోపం..పట్టణ ప్రజల్లో 73 శాతం

భారతీయులను వెంటాడుతున్న ప్రోటీన్ లోపం..పట్టణ ప్రజల్లో 73 శాతం

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించొచ్చు. ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని వాస్తవం. కారణాలు ఏవైనా ఈ రోజుల్లో ఆరోగ్యంపై కొంతమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. మనం ఏది తింటే ఆరోగ్యం ఉంటాం..ఎంత తింటే ఆరోగ్యంగా ఉంటాం వంటి అంశాలపై చాలామంది అవగాహన ఉండదు.అలాంటి సందర్భాల్లో విటమిన్ల లోపమో, ప్రోటీన్ డిఫిషియెన్సీ ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిలో ముఖ్యమైనది ప్రోటీన్ లోపం. అమూల్ వంటి కంపెనీలు ఇప్పుడు ఉపయోగించుకుంటున్న తీవ్రమైన ప్రజారోగ్య ఆందోళనను హైలైట్ చేస్తున్నాయి.

అమూల్ తాజాగా ఓ ప్రోటీన్ కుల్ఫీని విడుదల చేసింది. అంతకుముందు ప్రోటీన్ లస్సీ,హైప్రోటీన్ కూల్ కాఫీ వంటి ప్రోటీన్ ఉన్న ప్రాడక్టులను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి వదిలింది. ఇవి ఒక్కొక్కటి 10 గ్రాముల ప్రోటీన్ ను అందిస్తాయని చెబుతోంది. అమూల్ ప్రోటీన్ ఉన్న ప్రాడక్టు ఉత్పత్తులను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే అమూల్ ఆసక్తి వెనక అసలు ఏంటంటే.. ఇటీవల కాలంలో మనదేశంలో ఫిట్ నెస్ పై అవగాహన బాగా పెరిగింది.రిచ్ ప్రోటీన్  ఫుడ్ కోసం డిమాండ్ బాగా పెరిగింది. అమూల్ ఈ లోటును పూడ్చేందుకా అన్నట్లుగా ప్రోటీన్ ఉత్పత్తులను పెంచుతోంది. 

 భారత దేశం ప్రపంచంలోనే అత్యధిక ప్రోటీన్ లోపం సమస్యను ఎదుర్కొంటుంది. మార్కెట్ పరిశోధన సంస్థ(IMRB) నిర్వహించిన  ప్రోటీన్ కన్సంప్షన్ ఇన్ డైట్ ఆఫ్ అడల్ట్ ఇండియన్స్- ఏ జనరల్ కన్స్యూమర్ సర్వే (PRODIGY) ప్రకారం పట్టణాల్లో ప్రజలు 73 శాతం ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారట. ప్రతి 10మందిలో 9 మంది భారతీయులు రోజూ తీసుకోవాల్సిన ప్రోటీన్లు  తీసుకోవడంలేదని  సర్వే చెబుతోంది.  50 కిలోల బరువున్న వ్యక్తి సుమారు 0 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చెబుతోంది. అయితే సగటు భారతీయుడు కేవలం 6గ్రాములే తీసుకుంటున్నారు. 

ప్రోటీన్ లోపానికి చాలా కారణాలున్నాయి. రోజు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ సమృద్దిగా ఉన్నప్పటికీ ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. ఇది ప్రోటీన్ లోపానికి దారి తీస్తుంది. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల నాణ్యమైన ప్రోటీన్ తీసుకోలేని పరిస్థితి  ప్రోటీన్ లోపాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. 
అయితే శనివారం అమూల్ విడుదల చేసిన ప్రోటీన్ కుల్ఫీ సోషల్ మీడియాను షేక్ చేసింది. నెటిజన్లు కామెంట్లు, మీమ్స్ తో హల్ చల్ చేశారు. ప్రతి దానిలో అమూల్ ప్రోటీన్ నింపిన ప్రపంచాన్ని ఊహించుకుంటూ హాస్యంగా కామెంట్లు పెట్టారు. ప్రోటీన్ సమాసాలు, ప్రోటీన్ సిగరేట్లు, ప్రోటీన్ హెయిర్ గ్రోత్స్ సీరమ్స్ వంటి కూడా తయారు చేస్తే బాగుంటుందంటూ AI జనరేటెడ్ ఫొటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేశారు.

'అమూల్ ప్రోటీన్ సిగరెట్లు' అనే ఆలోచన సిగరేట్ తాగేవారినే కాదు.. తాగని వారిని ఆకర్షించిందంటే ఏ రేంజ్ లో క్రియేట్ చేశారో తెలుస్తోంది. 
అమూల్ ప్రోటీన్  కుల్ఫీ.. ఒకరకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రోటీన్ సమస్యను హైలైట్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో 73 శాతం మంది ప్రోటీన్ లోపం ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో చొప్పొచ్చు.