
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా దవారా తన అభిమానులకి తెలిపింది. అయితే అమీ జాక్సన్ యూకే కి చెందిన హాలీవుడ్ నటుడు, మ్యుజిషియన్ ఎడ్ వెస్ట్విక్ ని గత ఏడాది ఆగస్టులో పెళ్లి చేసుకుంది. దాదాపుగా నాలుగేళ్ళ ప్రేమ డేటింగ్ తర్వాత ఇరువురి పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులు తమ కుమారుడికి ఆస్కార్ అలెగ్జాండర్ అని నామకరణం చేశారు.. దీంతో సినీ సెలబ్రేటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియయజేస్తున్నారు..
ఈ విషయం ఇలా ఉండగా నటి అమీ జాక్సన్ కి ఆస్కార్ అలెగ్జాండర్ కాకుండా మరో కొడుకు కూడా ఉన్నాడు. అమీ జాక్సన్ గతంలో అమెరికన్ బిజినెస్ మెన్ జార్జ్ పనాయోటౌ ప్రేమ, డేటింగ్ నడిపింది. దీంతో వీరి రిలేషన్ కి గుర్తుగా 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే బ్రేకప్ అనంతరం అమీ జాక్సన్ బాలుడి సంరక్షణని జార్జ్ పనాయోటౌకి అప్పగించినట్లు సమాచారం. ఆ తర్వాత రెండేళ్ళకి అమీ జాక్సన్ ఎడ్ వెస్ట్విక్ తో ప్రేమలో పది పడి పెళ్లి చేసుకుంది.
అయితే నటి అమీ జాక్సన్ తెలుగులో హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన "ఎవడు" అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐ (మనోహరుడు), మన్మధుడు తదితర తమిళ్ సినిమాలతో ఆకట్టుకుంది. ఈమధ్య అమీ జాక్సన్ హాలీవుడ్ కి వెళ్లిపోవడంతో మళ్ళీ టాలీవుడ్ పై పెద్దగా దృష్టి సారించడం లేదు.
ALSO READ | PradeepRanganathan: దళపతి విజయ్ను కలిసిన డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్.. ఎందుకో తెలుసా?