Amy Jackson: రోబో హీరోయిన్.. ప్రెగ్నెన్సీ ఫొటోలు

Amy Jackson: రోబో హీరోయిన్.. ప్రెగ్నెన్సీ ఫొటోలు

రోబో 2.O హీరోయిన్ అమీ జాక్సన్ (Amy Jackson) గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేని పేరు. లేటెస్ట్గా అమీ జాక్సన్ రెండోసారి తల్లి కాబోతున్నట్లు ఇన్స్టా వేదికగా తెలిపింది. ఈ క్రమంలో అమీ జాక్సన్ తన బేబీ బంప్ ఫొటోస్ను షేర్ చేసింది. తన భర్త ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి హాలీడే డేట్ నైట్ ఫొటోస్ సైతం పంచుకుంది. ప్రస్తుతం అమీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే, అమీ జాక్సన్ షేర్ చేసిన ఓ పిక్ నెటిజన్స్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందులో అమీ జాక్సన్ తన సెమీ న్యూడ్ ఫోటోను షేర్ చేసుకోవడంపై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అందులో 'ప్రెగ్నెన్సీ అంటే మీ వ్యక్తిత్వాన్ని లేదా బికినీల పట్ల ప్రేమను చూపించడం కాదని', 'మీ అనుభూతిని షేర్ చేసుకోవడంఅంటే ఇలాంటి ఫొటోస్తో వైరల్ అవ్వడం అసలే కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అమీ పోస్ట్ చేసిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో చూసేయొచ్చు. 

ఆగస్ట్ 2024లో, తన ప్రియుడు హాలీవుడ్ నటు డు ఎడ్‌ వెస్ట్‌విక్‌ (Ed Westwick)ను అమీ జాక్సన్ పెళ్లాడింది.ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వీరి వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువర్గాల కుటుంబసభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. అక్టోబరు 2024లో, అమీ జాక్సన్ మరియు ఎడ్ వెస్ట్‌విక్ తమకు బిడ్డ పుట్టబోతున్నారని అధికారికంగా వెల్లడించారు.

ఇక అమీ జాక్సన్‌ విషయానికి వస్తే.. ఆమెకు 2019లో జార్జ్‌ పనయోట్టు (George Panayatiou) అనే బిజినెస్‌మెన్‌తో ఎంగేజ్మెంట్‌ చేసుకుంది. పెళ్లి కాకుండానే అతనివల్ల తల్లైంది. కానీ, కొన్ని కారణాల వాళ్ళ పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే 2022లో వీరి బంధానికి ఎండ్ కార్డు పడింది. ఇప్పుడు మళ్ళీ హాలీవుడ్‌ నటుడు వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని రెండో బిడ్డకి జన్మనివ్వనుంది.

రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ఎవడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది ఈ బ్యూటీ. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన 2.O సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది.