Amy Jackson: కొడుకు పుట్టిన తర్వాత అమీ జాక్సన్ వివాహం..కొత్త ప్రయాణం మొదలైందంటూ పెళ్లి ఫోటోలు షేర్

Amy Jackson: కొడుకు పుట్టిన తర్వాత అమీ జాక్సన్ వివాహం..కొత్త ప్రయాణం మొదలైందంటూ పెళ్లి ఫోటోలు షేర్

బాలీవుడ్‌ బ్యూటీ అమీ జాక్సన్ (Amy Jackson) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ఎవడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది ఈ బ్యూటీ. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన 2.O సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది.

తన ప్రియుడు హాలీవుడ్ నటు డు ఎడ్‌ వెస్ట్‌విక్‌ (Ed Westwick)ను అమీ జాక్సన్ పెళ్లాడింది.ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వీరి వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరువర్గాల కుటుంబసభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.

‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది.." అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అమీ జాక్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుక కోసం డిజైన్ చేసిన వైట్ గౌన్ లో అమీ జాక్సన్ దేవకన్యలా మెరిసిపోయింది. ఆమె భర్త ఎడ్‌ వెస్ట్‌విక్‌ వైట్ బ్లేజర్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఈ హాట్ లేడీని హత్తుకున్న ఫోటోలునెటిజన్స్ను ఆకట్టుకుంటున్నాయి. 

ఇక అమీ జాక్సన్‌ విషయానికి వస్తే.. ఆమెకు 2019లో జార్జ్‌ పనయోట్టు (George Panayatiou) అనే బిజినెస్‌మెన్‌తో ఎంగేజ్మెంట్‌ చేసుకుంది. పెళ్లి కాకుండానే అతనివల్ల తల్లైంది. కానీ, కొన్ని కారణాల వాళ్ళ పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే 2022లో వీరి బంధానికి ఎండ్ కార్డు పడింది. అప్పటి నుంచి కొడుకు ఆండ్రెస్‌తో ఒంటరిగానే ఉంటోంది అమీ జాక్సన్‌. ఇప్పుడు మళ్ళీ హాలీవుడ్‌ నటుడు వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న ఆమీ మరోసారి వార్తల్లోకెక్కింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ed Westwick (@edwestwick)