రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి నాగన్ పల్లి, పోల్కంపల్లి మీదుగా అనాజ్ పూర్ వరకు 80ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయ్యింది. దీంతో స్థానికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించేందుకు వచ్చారు మున్సిపల్ అధికారులు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పలు గృహ నిర్మాణాలను కూల్చివేస్తుండగా బాధితులు అధికారులపై తిరగబడ్డారు. ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించకుండా ఇండ్ల దగ్గరకు ఎలా వస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు,పోలీసులులతో వాగ్వాదానికి దిగారు మహిళలు. దీంతో చేసేదేమి లేక మున్సిపల్ అధికారులు అక్కడి నుండి సిబ్బంది వెనుదిరిగారు.
మరిన్ని వార్తల కోసం
డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు
జైలు కంటే వైద్యం ముఖ్యమని 1100 కోట్లతో కొత్త దవాఖాన